Cyclone Gulab: తీరాన్ని తాకిన గులాబ్.. మరో 3 గంటలు అలెర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవనుంది. ప్రస్తుతం గులాబ్‌ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో..

Cyclone Gulab

Cyclone Gulab: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవనుంది. ప్రస్తుతం గులాబ్‌ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. కళింగ పట్నానికి ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీరం దాటడానికి మరో 3 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కలింగపట్నం, గోపాల్‌పూర్ మధ్య తుఫాన్ తీరం దాటనుంది.

Cyclone Gulab టెన్షన్.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్

ఉత్తరాంధ్ర, ఒడిషాలను గులాబ్ తుఫాన్ వణికిస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర వెంట గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు ఈ తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగనుండగా ఇప్పటికే పలు చోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం అత్యంత ప్రమాదకరంగా వుండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Cyclone Gulab ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. గులాబ్ తుఫాన్ .. ఒడిషా, ఆంధ్రాలపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో బలమైన ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పనరావాస కేంద్రాలకు తరలించగా వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.