Daggubati Purandeswari : ఏపీ ఆర్థిక స్థితి అంచనాకోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి

ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురందేశ్వరి అన్నారు.

Daggubati Purandeswari

Nirmala Sitharaman : రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల పైన, బెవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థలపైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని నిర్మలా సీతారామన్ ను పురందేశ్వరి కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, చేసిన అప్పులు 10.77 లక్షల కోట్లు అంశాలు మీ దృష్టికి తేవడం జరిగిందని,  నేటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే ఉందని అన్నారు.

Also Read : MLA Eluri Sambasivarao : టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి

ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురందేశ్వరి అన్నారు. పార్లమెంట్ లో ఇచ్చిన ఈ సమాధానంను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ సొంత వాలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేస్తున్నారని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని, అన్నిరకాల సావనీర్ గ్యారంటీలను, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఏఫ్ఆర్భీఏం పరిధి లోకి తేవాలని నిర్మలా సీతారామన్ కు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.