AP Crime : ఏపీలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్యచేసిన యువతి.. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు..

AP Crime : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమ కార్యకలాపాలకు అడ్డొస్తొందని సొంత తల్లిని ప్రియుడితో కలిసి యువతి హతమార్చింది.

AP Crime

AP Crime : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమ కార్యకలాపాలకు అడ్డొస్తొందని సొంత తల్లిని ప్రియుడితో కలిసి యువతి హతమార్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : 1980s Vintage Look : 1980 వింటేజ్‌ లుక్‌ ట్రెండ్‌.. జాగ్రత్త గురూ.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే చాన్స్..! ఈ జాగ్రత్తలు పాటించాలి..

మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మీ (45) తన కుమార్తె పుష్పలతతో కలిసి 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. పుష్పలతకు రాజా అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై తల్లీకూతుళ్లకు మధ్య విబేధాలు నడుస్తున్నాయి. లక్ష్మీ శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని కుమార్తె చెప్పగా.. ఆరోగ్యంగా ఉండే లక్ష్మీ అకస్మాత్తుగా మరణించడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతురాలి కుమార్తె, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల వారిని.. మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.