Heavy Rain Alert: బలపడిన అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు!
రాబోయే రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు(Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Meteorological Department issued warning heavy rains in AP For next two days.
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య–పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ–వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ప్రధానంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై తీవ్రంగా ఉండటంతో, రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక:
శనివారం శ్రీకాకుళం (వాతావరణ శాఖ, ఏపీ వర్షాలు, భారీ వర్ష హెచ్చరిక,)జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్ష సూచన ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుంది.
ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు:
రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో శుక్రవారం రాత్రికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ ప్రకటనల బోర్డుల కింద నిలబడకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
