Death Certificates: డెత్ సర్టిఫికెట్ల జారీ జాప్యంపై అధికారుల రియాక్షన్

Death Certificates

Death Certificates: విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ డెత్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ జారీ జాప్యంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ 10టీవీ వారి బాధను బయటపెట్టింది. ఛానెల్ ప్రసారమైన అంశంపై సీఎహ్ఓహెచ్ గీతాభాయ్ రెస్పాండ్ అయ్యారు.

కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో బెజవాడలో మరణాలు ఎక్కువగా జరిగాయి. మే నెలలో 1500 మంది కోవిడ్, నాన్ కోవిడ్‌తో చనిపోయారు. అదే సమయంలో సర్వర్లు పనిచేయకపోవడం, సిబ్బంది తక్కువగా ఉండడం కారణంగా వారం రోజుల పాటు ఇబ్బందులు తలెత్తాయి.

ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో సాధారణంగా చనిపోయినా కోవిడ్ డెత్ అని పంపుతున్నారు. వెరిఫై చేసిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం. ఈ కారణంగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం అవుతుంది.

21 రోజుల్లో డెత్ సర్టిఫికెట్ జారీ చేయాల్సిన మాట వాస్తవమే. హాస్పిటల్ నుంచి రిపోర్టులు లేట్‌గా వస్తుండడంతో వ్యవధి పెరుగుతుంది. డెత్ సర్టిఫికెట్లు త్వరితగతిన జారీ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. సిబ్బంది తక్కువగా ఉండడం కూడా సమస్యను రెట్టింపు చేసింది.

గ్రౌండ్ లెవల్లో హెల్త్ అసిస్టెంట్లను, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేస్తాం. అనుమతుల్లేని హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స తీసుకొని మృతి చెందితే సరైన సర్టిఫికెట్లు తీసుకువస్తేనే వారికి కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తాం. మరో మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించి త్వరితగతిన డెత్ సర్టిఫికెట్ జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని గీతాభాయ్ అన్నారు.