Man Commits Suicide
Man commits suicide along with children : భార్య మరణించదన్న వార్త.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఆ బాధను తట్టుకోలేక ఆమె దగ్గరికే వెళ్లాలని నిర్ణయించుకొని తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని ముత్రాసు కాలనీలో జరిగింది.
భార్య చనిపోయిందన్న తీవ్ర మనస్తాపంతో కొక్కిరి సత్యనారాయణ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన ఇద్దరు పిల్లలలో లోకేష్ వయసు 10 ఏళ్లు కాగా.. మరో చిన్నారి తేజ వయస్సు 9 సంవత్సరాలు.
సత్యనారాయణ భార్య పుష్పలత.. అనారోగ్యంతో రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త.. ఈ రోజు పిల్లలతో సహా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాధం నెలకొంది..