Krishna Duvvuri : టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయి

టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయని ఫైనాన్స్, ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ కృష్ణ దువ్వూరి తెలిపారు. ఈ మేరకు అప్పులపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు.

Krishna Duvvuri

Krishna Duvvuri : టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయని ఫైనాన్స్, ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ కృష్ణ దువ్వూరి తెలిపారు. ఈ మేరకు అప్పులపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ దువ్వూరి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయడం సహజమేనని చెప్పారు. ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకనామి పెరిగిందన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిగా వినియోగించి ఉంటే.. ప్రస్తుతం ఆర్థిక భారం వచ్చేదికాదని తెలిపారు. కరోనాతో దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. రూ.21 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుందన్నారు.