ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1537 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,516 శాంపిల్స్ పరీక్షించగా 7,822 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేటి వరకు రాష్ట్రంలో 21, 10,923 శాంపిల్స్ ను పరీక్షించారు.
గత 24 గంటల్లో అనంతపురం 953, చిత్తూరు 240, తూర్పుగోదావరి 1113, గుంటూరు 573, కడప 576, కృష్ణా 240, కర్నూలు 602, నెల్లూరు 500, ప్రకాశం 364, శ్రీకాకుళం 495, విశాఖ 1049, విజయనగరం 677, పశ్చిమగోదావరి 440 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వల్ల పశ్చిమగోదావరి 11, విశాఖ 9, ప్రకాశం 8, నెల్లూరు 7, శ్రీకాకుళం 7, విజయనగరం 4, చిత్తూరు 3, కృష్ణా 3, కర్నూలు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కపడ 2 చొప్పున మృతి చెదారు.