Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పిళ్లై అరెస్ట్ తో సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది. రేపు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఎల్లుండి పిళ్లైతో కలిపి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను ఎమ్మెల్సీ కవిత బినామీని అని ఈడీ విచారణలో చెప్పి తర్వాత మాట మార్చిన అరుణ్ రామచంద్ర పిళ్లైకు గురువారంతో (మార్చి16) ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో పిళ్లైను కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా.. కవిత విచారణకు వచ్చారా? అని ఈడీ అధికారులను కోర్టు ప్రశ్నించింది. రాలేదని సమాధానమిచ్చారు అధికారులు. కవిత విచారణకు రాలేదని.. కవితతో కలిపి పిళ్లైను మరోసారి విచారించాలని, పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో పిళ్లై కస్టడీని సోమవారం (మార్చి20) వరకు పొడిగించింది కోర్టు.(Delhi Liquor Scam)
ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే. గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయటం విచారించటం జరిగాయి. కొన్ని రోజులకు బుచ్చిబాబుకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక, తాజాగా కవిత ఈడీ విచారణకు హాజరు కాకపోవటం.. అరుణ్ పిళ్లై కస్టడీని పొడిగించటమే కాకుండా బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. విచారణకు రావాలని ఆదేశించింది.(Delhi Liquor Scam)
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. మార్చి 11న ఈడీ విచారణకు హాజరైన కవితను మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈక్రమంలో కవిత ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీనికి పలు కారణాలు చెప్పుకొచ్చారు. తాను చట్టసభ ప్రతినిధిగా, చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందున్న అన్ని అవకాశాలను వాడుకుంటానని అన్నారు. మహిళలను ఆఫీసుకి పిలిపించి విచారించకూడదని.. తాను ఆడియో, వీడియో రూపంలో విచారణకు సన్నద్ధంగానే ఉన్నానని.. లేదంటే అధికారులు తన ఇంటికి వచ్చి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు.(Delhi Liquor Scam)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్టయ్యారు. ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ‘సౌత్ గ్రూప్’లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది.