MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు కవిత ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు కవిత ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు. మహిళల్ని ఈడీ తన కార్యాలయానికి పిలిచి, విచారణ జరపవచ్చా.. లేదా అనే అంశంపై కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ నెల 24న ఈ కేసు విచారణ జరిగాకే ఈడీ విచారణకు హాజరవుతానని కవిత తన లేఖలో పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ సరికాదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై తనకు సంబంధించిన న్యాయ నిపుణులతో ఆమె సంప్రదింపులు జరిపారు. దీంతో ఆమె గురువారం జరగాల్సిన విచారణకు హాజరు కాలేదు.
Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు
ఈ నేపథ్యంలో ఈడీ ఆమెకు మరోసారి నోటీసులు అందజేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని ఆదేశించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. మరోవైపు ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న పిళ్లైని కోర్టులో గురువారం ప్రవేశపెట్టింది. ఈ రోజుతో ఆయన కస్టడీ ముగిసిన నేపథ్యంలో, కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. పిళ్లై కస్టడీని సోమవారం వరకు పొడిగించింది.