Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు

గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్తోంది. జహీరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.

Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు

Updated On : March 16, 2023 / 2:56 PM IST

Rains In Telangana: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అనేక చోట్ల వానలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట్ నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది.

సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్తోంది. జహీరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. కోహిర్ మండలం బండపేట్‌లో వడగళ్ల వాన పడుతోంది. ఈ ప్రాంతంలో ఉరుములు-మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.