Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందన్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న బీజేవైఎం కార్యకర్తలను బండి సంజయ్ గురువారం పరామర్శించారు.

MLC Kavitha-Delhi liquor Scam: మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించకూడదు: ఎమ్మెల్సీ కవిత లేఖ

ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది. ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అయింది.  ప్రతిదానికి బండి సంజయ్‌ను బద్నాం చేయటం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారింది. బీఆర్ఎస్‌కు, కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్.. ఇతరులకు మరొక రూల్ ఉంటుందా?

Ap Budget 2023-24 : బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

కొడుకును కాపాడుకోవటానికి సీఎం కేసీఆర్ నానా పాట్లు పడ్తున్నాడు. టీఆర్ఎస్‌లో ఉన్న రేణుక కుటుంబం కోసమే పేపర్ లీకేజీ జరిగింది. అక్రమంగా రేణుకకు గురుకుల పాఠశాలలో ఉద్యోగం ఇచ్చారు. నిరుద్యోగుల‌ తరపున పోరాడుతోన్న భానుప్రకాష్‌ను పోలీసులు వేధిస్తున్నారు. జైలుకు పంపినంత మాత్రాన బీజేవైఎం వెనుకడుగు వేసే ప్రకస్తే లేదు. సిట్‌తో ఉపయోగం లేదు. లీకేజీపై సిట్టింగ్ జడ్జిరో విచారణ జరపాలి. టీఎస్‌పీఎస్‌సీని రద్దు చేసి.. ఛైర్మన్ ను ప్రాసిక్యూట్ చేయాలి. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.