Ap Budget 2023-24 : బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Ap Budget 2023-24 : బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

Ap assembly 14 TDP members suspended

Ap Budget 2023-24 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు. ఈక్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని ఎటువంటి అభివృద్ధి లేదంటూ ఆందోళన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆందోళన చేయటం సరికాదని సీఎం జగన్ సీరియస్ అయ్యారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద పేపర్లు చింపివేసి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని 14మంది టీడీపీ సభ్యులను అసెంబ్లీ సమావేశం నుంచి సస్పెండ్ చేశారు.

సస్పెండ్ అయినవారిలో అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బుచ్చయ్య చైదరి, ఆదిరెడ్డి భవానీ,చినరాజప్ప, గద్దె రామ్మెహన్, రామరాజు,సాంబశివరావు,గొట్టిపాటి రాజ్ కుమార్, బాలవీరాంజనేయులతో సహా పలువురు ఉన్నారు.

కాగా..ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2023-24 వార్షిక బడ్జెట్ లో పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ అన్నారు. వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని, పరిపాలనాపరమైన మార్పులు చేసినా వాటికి కేటాయింపులు చేశామని తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను బలపరిచేలా, పథకాల ఫలాలు మరింత మందికి అందించేలా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు బుగ్గన తెలిపారు.