MLC Kavitha-Delhi liquor Scam: మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించకూడదు: ఎమ్మెల్సీ కవిత లేఖ

తనను రాత్రి 8 గంటల వరకు విచారించారని కవిత చెప్పారు. తనను ఇవాళ విచారణకు రావాలని చెప్పారని, అయితే, వ్యక్తిగతంగా రావాలని మాత్రం సమన్లలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన ప్రతినిధిగా భరత్‌ ను ఈడీ వద్దకు పంపుతున్నానని తెలిపారు. కాగా, ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కవిత తరఫు న్యాయవాది సోమ భరత్ కుమార్ అన్నారు.

MLC Kavitha-Delhi liquor Scam: మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించకూడదు: ఎమ్మెల్సీ కవిత లేఖ

Kavitha On ED summons

MLC Kavitha-Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ కు ఇవాళ ఓ లేఖ రాశారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరిగాకే ఈడీ విచారణకు హాజరవుతానని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని అన్నారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవచ్చా? అనే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు.

చట్ట సభ ప్రతినిధిగా, చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటానని అన్నారు. మహిళలను ఆపీసుకి పిలిపించి విచారించకూడదని చెప్పారు. తాను ఆడియో, వీడియో రూపంలో విచారణకు సన్నద్ధంగానే ఉన్నానని తెలిపారు. లేదంటే అధికారులు తన ఇంటికి వచ్చి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. ఇటీవల జరిగిన విచారణలో పూర్తిగా సహకరించానని అన్నారు.

తనను రాత్రి 8 గంటల వరకు విచారించారని కవిత చెప్పారు. తనను ఇవాళ విచారణకు రావాలని చెప్పారని, అయితే, వ్యక్తిగతంగా రావాలని మాత్రం సమన్లలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన ప్రతినిధిగా భరత్‌ ను ఈడీ వద్దకు పంపుతున్నానని తెలిపారు. కాగా, ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కవిత తరఫు న్యాయవాది సోమ భరత్ కుమార్ అన్నారు.

మహిళలను, చిన్న పిల్లలను ఇంటి వద్దే విచారించాలని చెప్పారు. ఈడీ విచారణ 6 గంటలకు దాటకూడదని, కవితను 8 గంటల పాటు విచారించారని తెలిపారు. కవిత సెల్ ఫోన్ తీసుకోవడం కూడా చట్ట విరుద్ధమని చెప్పారు. కాగా, కవిత విజ్ఞప్తిపై ఈడీ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

MLC Kavitha-Delhi liquor scam: విచారణకు హాజరుకాలేనన్న కవిత.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు