వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి బిగ్ షాక్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.

illegal constructions Demolition

illegal constructions Demolition : వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు షాకిచ్చారు. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో ద్వారంపూడి అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.