Corona : ఏపీలో 5,398 యాక్టీవ్ కేసులు.. కొత్తగా 478 నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఏపీలో మాత్రం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి
- kunduru Vinod
- Published On : October 22, 2021 / 06:53 PM IST
Ap Corona Cases
Corona : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఏపీలో మాత్రం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,494 నమూనాలను పరీక్షించగా 478మంది కరోనా బారినపడినట్లు ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక కరోనాతో ఆరుగురు మృతి చెందినట్లు పేర్కొన్నారు. కరోనా నుంచి నిన్న 574 మంది కోలుకున్నారు.
చదవండి : Coronavirus: డెల్టా కంటే ప్రమాదకరమైన సబ్-వేరియంట్.. పెరిగిన వైరస్ వేగం!!
రాష్ట్రంలో ప్రస్తుతం 5,398 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరులో ఒకరు చొప్పున మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన వాటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,62,781 చేరింది. ఇప్పటివరకు 14,333 మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకొని ఇళ్ళకి వెళ్లిన వారి సంఖ్య 20,43,050గా ఉంది.
చదవండి : AP Corona : ఏపీలో 5,500 కరోనా యాక్టివ్ కేసులు
#COVIDUpdates: 22/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,886 పాజిటివ్ కేసు లకు గాను
*20,40,155 మంది డిశ్చార్జ్ కాగా
*14,333 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,398#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/x0ghP1vfrV— ArogyaAndhra (@ArogyaAndhra) October 22, 2021
