Coronavirus: డెల్టా కంటే ప్రమాదకరమైన సబ్-వేరియంట్.. పెరిగిన వైరస్ వేగం!!

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించింది. మనదేశంలో కూడా వైరస్ విస్తరణ వేగం చాలావరకు తగ్గింది.

Coronavirus: డెల్టా కంటే ప్రమాదకరమైన సబ్-వేరియంట్.. పెరిగిన వైరస్ వేగం!!

Delta Variant

Coronavirus: కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించింది. మనదేశంలో కూడా వైరస్ విస్తరణ వేగం చాలావరకు తగ్గింది. అయితే, రష్యాలో డెల్టా కంటే ప్రమాదకరమైన సబ్-వేరియంట్, డెల్టా కంటే 10శాతం ఎక్కువ వేగంగా విస్తరించే వైరస్ కనుగొన్నారు నిపుణులు. రష్యాలో కరోనా సంక్రమణ వేగం పెరగగా.. దానిని AY.4.2 సబ్-వేరియంట్‌గా గుర్తించారు. ఈ వేరియంట్ మాతృక డెల్టా వేరియంట్ కాగా.. డెల్టా వేరియంట్ కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఈ AY.4.2 సబ్-వేరియంట్ కారణంగా రష్యాలో ప్రతిరోజూ కొత్త కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రష్యన్ పరిశోధకుడు కమిల్ ఖఫీజోవ్ మాట్లాడుతూ.. ఈ వేరియంట్‌ ప్రమాదమే కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘కరోనా వైరస్ వ్యాక్సిన్‌లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని, ఈ వేరియంట్‌పై పోరాడుతాయని చెప్పారు.

బ్రిటన్‌లో కూడా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ సోకినవారు వేగంగా పెరగడానికి AY.4.2 సబ్‌వేరియంట్ కారణమని అక్టోబర్ 15న విడుదల చేసిన UK హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఇప్పటివరకు 6 శాతం కరోనా వైరస్ కేసుల పెరుగుదల కనిపించింది.

రష్యా, బ్రిటన్‌‍లు ఈ కొత్త సబ్ వేరియంట్ కారణంగా మళ్లీ కరోనా నిబంధనల్లో మార్పులు తీసుకుని వచ్చాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి.