Madhanapalle
Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు జరిగాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చగా.. భారీగా పేలుడు సంభవించి, బండరాళ్లు పరిసరాల్లో నివసించే ప్రజల ఇళ్లపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీమార్ట్ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.