Srikalahasti Temple: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మరోసారి ఆగిన రాహు – కేతు పూజలు

శ్రీకాళహస్తీ ఆలయంలో రాహు కేతు పూజలో వినియోగించే నాగ పడగలకు తీవ్ర కొరత ఏర్పడడంతో భక్తులు పూజలు నిర్వహించ వీల్లేకుండా ఉంది.

Srikalahasthi

Srikalahasti Temple: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షత్రం శ్రీకాళహస్తీ ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయంలో రాహు కేతు దోష నివారణ పూజల నిమిత్తం ఆలయానికి వచ్చే భక్తులకు ఇటీవల తీవ్ర నిరాశ ఎదురవుతుంది. రాహు కేతు పూజలో వినియోగించే నాగ పడగలకు తీవ్ర కొరత ఏర్పడడంతో భక్తులు పూజలు నిర్వహించ వీల్లేకుండా ఉంది. పూజకు అవసరమైన నాగ పడగలు లేకపోవడంతో ఆలయ అధికారులు టికెట్ల పంపిణీ నిలిపివేశారు. దీంతో గత మూడు రోజులుగా ముక్కంటి ఆలయంలో రాహు – కేతు పూజలు నిలిచిపోయాయి. అయితే విషయం తెలియని భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటున్నారు.

Also Read: Kerala Temple: ముస్లింతో కొడుక్కి పెళ్లి జరిపించాడని అనుమతికి గుడి నిరాకరణ

పూజలు నిలిచిపోవడంపై భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు ఆలయ మింట్ లో ఉద్యోగులు సెలవులో ఉండడంతో నాగపడగల తయారీ నిలిచిపోయిందని దీంతో నాగపడగల కొరత ఏర్పడిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. దోష నివారణ పూజలపై ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగపడగలు ఎపుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపైనా స్పష్టత లేకపోవడంపై అధికారుల తీరుపట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహు కేతు దోష నివారణ నిమిత్తం దేశవిదేశాల నుంచి భక్తులు శ్రీకాళహస్తీ ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

Also read: Thiruvannamalai Girivalam : పౌర్ణమికి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు అనుమతి ఇచ్చిన కలెక్టర్