ధనుర్మాస ఘడియలు : తిరుమలలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై

  • Publish Date - December 16, 2019 / 02:51 AM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై ప్రవచనాలు వినిపించనున్నాయి. ఆలయంలో 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం తెల్లవారుజామున నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై ప్రవచనాలు పఠించనున్నారు. నెల రోజులు సుప్రభాత సేవ రద్దు చేస్తారు.

తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా శ్రీ వారికి నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాస ఘడియలు 2019, డిసెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 11.47 గంటలకు ప్రారంభం కానున్నాయి. 2020 జనవరి 14వ తేదీ ముగుస్తాయి. 

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా లేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహా విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడిని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా..పూజా ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో..బ్రహ్మాండనాయకుడికి ధనుర్మాస పూజలు చేస్తారు. 

తిరుప్పావై పారాయణం : –
* 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) ఒకరు. 
* ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. 
 

* ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం అంటారు. 
* నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. 
Read More : ఏపీ అసెంబ్లీ : 11 కీలక బిల్లులు..మద్యం విక్రయం, రవాణాపై ఉక్కుపాదం