Dhulipalla Narendra Kumar
వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.
విజయవాడలో సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో దీని గురించి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని కుల్చేస్తామనే వార్తను సోషల్ మీడియాలో సృష్టించారని అన్నారు. వైసీపీ కీలక నేతల ఆదేశాలతోనే ఈ ప్రచారం చేశారని తెలిపారు.
వైసీపీ నాయకులపై ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. మరి తమపై తప్పుడు పోస్టులు పెడితే పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సమాజంలో కుల వివాదాలను రెచ్చగొట్టాలని కొందరు పోస్టులు పెడుతుంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. ఏపీలో ఎన్నికలు ఉండడంతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ తీరుపై అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
Narendra Modi: మన బాలరాముడు ఇకపై టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు: మోదీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు