Diamond found
Kurnool District: తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో కర్నూల్ జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. దీంతో జనం తమ లక్ ను పరీక్షించుకునేందుకు వజ్రాల వేటకోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని మద్దికేర మండలంలో ఓ వ్యక్తికి భారీ విలువైన వజ్రం లభ్యమైంది. దీని విలువ రూ.90లక్షలు ఉంటుందని తెలుస్తుంది. అయితే, పెరవలికి చెందిన వ్యాపారస్తుడు రూ.30లక్షలు, 10 తులాల బంగారంకు ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడని, బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ మూడు రెట్లు ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతుంది.
Also Read: వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
ఒక్కరోజే మద్దికేర, తుగ్గులి మండలాల్లో మూడు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో దొరికిన వజ్రం రూ. 30లక్షల విలువైంది కాగా.. తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో 1.5 లక్షల విలువైన వజ్రం.. మద్దికేర మండలంలో కొల్హాపూర్ లక్ష్మీదేవి గుడి దగ్గర ఒక వజ్రం దొరికినట్లు సమాచారం. తొలకరి వర్షాలు పడుతుండటంతో వజ్రాలు వెతకడానికి వచ్చిన బాపట్ల జిల్లాకు చెందిన మహిళకు మద్దికెర మండలం పెరవలి గ్రామంలోని పొలంలో వజ్రం దొరికినట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.
మరోవైపు తొలకరి జల్లులు కురవడంతో తుగ్గలి, మద్దికెర మండలాల్లోని పొలాల్లో వజ్రాలు వెతికేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. వజ్రాలు వెతికేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వజ్రాల అన్వేషకులు భారీగా తరలివస్తున్నారు. గత వారంరోజుల నుంచి ఇప్పటి వరకు నాలుగు వజ్రాలు ఈ ప్రాంతాల్లో లభ్యమైనట్లు సమాచారం. విజయవాడ, తెలంగాణ, అనంతపురం, బళ్లారి, నంద్యాల, గుంటూరు, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి ప్రజలు వజ్రాలు వెతికేందుకు ఎక్కువగా వస్తున్నారు.