ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని..అందుకే తమ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ చట్టం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఆయన వివరించారు.
* రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే : 7 రోజుల్లో దర్యాప్తు..14 రోజుల్లో విచారణ పూర్తి..ఉరి శిక్ష వేయడానికి అనుగుణంగా చట్టాన్ని రూపొందించామన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన అనంతరం చట్టంగా రూపుదిద్దుతుందన్నారు. ఇది రాష్ట్ర పరిధిలో లేనిదని వెల్లడించారు.
రాష్ట్ర పరిధిలో మార్పులు :
* పిల్లలు, మహిళలపై నేరాలు జరిగితే..వారికి శిక్ష విధించేందుకు…13 జిల్లాల్లో 13 కోర్టులు వెంటనే ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రూ. 24 కోట్లు కేటాయించి..హైకోర్టుకు విన్నవించడం జరిగిందన్నారు.
* పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నామని, రూ. 1.65 కోట్ల నిధులను కేటాయించామన్నారు.
* రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని, దిశ పేరు పెట్టామని..ఈ నెలాఖరుకు..13 జిల్లాల్లో 18 పోలీస్ స్టేషన్‌లుంటాయన్నారు.
* డీఎస్పీ నేతృత్వంలో 36 నుంచి 47 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఇందులో అత్యధిక మంది మహిళలే ఉంటారన్నారు.
* రాజమండ్రి పీఎస్‌లో ఎస్పీ మహిళ అని, ఏకంగా 47 మంది మహిళా సిబ్బంది ఉన్నారని..ఇందుకు వారిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
* రాష్ట్రంలో ఒకే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందని, దీనిని కూడా మారుస్తూ..రూ. 31 కోట్లు కేటాయించామని, మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కేటాయిస్తామని, అదనపు సిబ్బందిని నియమించుకొనేందుకు ఫర్మిషన్ ఇచ్చామన్నారు.
* దిశ కాల్ సెంటర్, దిశ యాప్‌లు ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్.