Disc Award for Kashibugga SI shirisha : శ్రీకాకుళంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కాశిబుగ్గ ఎస్‌ఐ శిరీషకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ డిస్క్ అవార్డ్ అందించారు. శిరీష సేవాభావాన్ని డీజీపీ ప్రశంసించారు. ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తులు తమ డిపార్ట్‌మెంట్‌లో ఉండడం గర్వకారణమన్నారు. తన సేవను గుర్తించినందుకు సంతోషంగా ఉందని ఎస్‌ఐ శిరీష తెలిపారు.
తాను చేసిన సేవను గుర్తించి తనకు అవార్డ్ అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది తనకు దక్కిన గౌరవం కాదని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తానికి దక్కిన గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. పోలీసులు సేవ చేయడానికి ఉన్నారని తెలిపారు.