Teachers’ Service Extension : జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సరైన మార్గదర్శకాలు లేవంటూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఏడాది పొడిగింపు జీవో 101ను నిలిపివేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఈ జీవోతో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశముందని విద్యాశాఖ అభిప్రాయపడింది.