ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉండడంతో పలు చర్యలు తీసుకున్నారు అధికారులు. జిల్లాలో కరోనా వైరస్ హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పాఠశాలలకు 18వరకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు. ఇప్పటికే నగరంలో సినిమా హాల్స్ ను మూసివేసిన అధికారులు.. మాల్స్ లో పర్యవేక్షణ, ఎక్కువగా జనవాసాలు గుమికూడవద్దని సూచించారు.
ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో అలెర్ట్ అయిన జిల్లా యంత్రాంగం.. 150 మంది అనుమానితులను పరిశీలనలో ఉంచింది వైద్య శాఖ. ఐసోలేషన్ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నగరంలో స్విమ్మింగ్ ఫూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్ట్, శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేశారు.
అలాగే పలువురు సిబ్బందికి సెలవులు ప్రకటించారు అధికారులు. సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (కోడి మాంసం తింటే కరోనా రాదు)
Also Read | రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు