dolphin washup : విశాఖ సాగరతీరంలో మృత డాల్ఫిన్…

విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ బీచ్‌ సమీపంలో సముద్రంలో నుంచి మృతి చెందిన డాల్ఫిన్‌ తీరానికి కొట్టుకు వచ్చింది. సాగరజలాల్లో చాలా లోపల ఈ రకం డాల్ఫిన్లు సంచరిస్తుంటాయి.

Dolphin Wash Up Dead On Vizag Beaches

dolphin wash up dead : విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ బీచ్‌ సమీపంలో సముద్రంలో నుంచి మృతి చెందిన డాల్ఫిన్‌ తీరానికి కొట్టుకు వచ్చింది. సాగరజలాల్లో చాలా లోపల ఈ రకం డాల్ఫిన్లు సంచరిస్తుంటాయి. కొన్నిసార్లు మృతిచెందిన డాల్ఫిన్లు తీరానికి కొట్టుకొస్తుంటాయి.

సాగరంలో ముందుకు ఈదే క్రమంలో వలల తాళ్లు నోటి భాగంలో ఇరుక్కోవడం లేదా పడవల ఇంజన్ల బారిన పడి డాల్ఫిన్లు మృత్యువాత పడే అవకాశాలు ఉంటాయని విశాఖ మత్స్యశాఖాధికారిణి విజయ తెలిపారు.  ఒక్కో డాల్ఫిన్ 70 కిలోలకు పైగా బరువు పెరుగుతాయన్నారు. విగత జీవిగా చేరిన ఈ డాల్ఫిన్‌ సుమారు 60 కిలోలు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు.