Srisailam Temple (1)
Drones in SriSailam: కశ్మీర్‌లోని ఎయిర్‌ఫోర్స్ లో డ్రోన్ కనిపించింది మొదలు దేశవ్యాప్తంగా డ్రోన్ల అలజడి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు డ్రోన్ కలకలం శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనూ కనిపించింది. అర్ధరాత్రి ఆలయ పరిసరాల్లోని ఆకాశంలో అనుమానస్పదంగా డ్రోన్ కెమెరాల చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది.
వాటిని పట్టుకునేందుకు పోలీసులు, దేవస్థానం సిబ్బంది అటవీశాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ దొరకలేదు. ఇది మొదటిరోజు కాదని నాలుగు రోజులుగా రాత్రుళ్లు ఎగురుతూనే ఉన్నాయి.
ఎయిర్ ఫోర్స్ పరిధిలో డ్రోన్లు ఎగరడంతో ఉగ్రవాద దాడిగా అనుమానించింది ఎన్ఐఏ. ఈ క్రమంలోనే శ్రీశైలం ఏం జరుగుతుందా అని అనుమానిస్తున్నారు స్థానికులు.