Cm Chandrababu Naidu : అటానమస్ డ్రోన్ల సాయంతో సెక్యూరిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో మార్పులు..

ఒక వేళ అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందిస్తారు.

Cm Chandrababu Naidu Security

Cm Chandrababu Naidu : ఏపీ 1 తన భద్రత పేరుతో ప్రజలు, కార్యకర్తలకు దూరం చేయొద్దని గతంలో చెప్పిన సీఎం.. ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో భద్రతను కుదించారు. ఉండవల్లి నివాసంలో డ్రోన్ తో పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భద్రత పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

తిరుమల వెళ్లిన సమయంలో భద్రత పేరుతో పరదాలు కట్టగా.. వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ తర్వాత తన కోసం గంటల తరబడి ట్రాఫిక్ ను ఆపొద్దని సూచించారు. ప్రజలు, కార్యకర్తలకు దూరం చేసేలా సెక్యూరిటీ ఉండకూడదని ఆదేశించారు. కానీ నిఘా విభాగం, సెక్యూరిటీ వింగ్ మాత్రం ప్రొటోకాల్ ప్రకారం తప్పదని చెబుతోంది. ఈ క్రమంలో పోలీసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read : కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్‌.. ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారా?

ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి సాంకేతికతను పెంచి సెక్యూరిటీని తగ్గించారు. చంద్రబాబు నివాసంలో అటానమస్ డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అత్యాధునిక డ్రోన్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ కు తగిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి డ్రోన్ షూట్ చేస్తున్నారు.

ఒక వేళ అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందిస్తారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్ గా ఆ సమయానికి ఎగురుతుంది. మళ్లీ దానికి అదే డెక్ పై ల్యాండ్ కాగానే చార్జింగ్ అవుతుంది.

Also Read : ఒక్క పోస్ట్‌.. ఇద్దరు లాబీయింగ్..! ఆ నామినేటెడ్‌ పోస్ట్‌ కు ఎందుకంత డిమాండ్? దక్కేదెవరికి?