Vijayawada : ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్‌ 26 నుంచి దసరా ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్‌ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.

Indrakeeladri

Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్‌ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.

సెప్టెంబర్‌ 26న దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత అలంకారంలో, 27న బాలాత్రిపురా సుందరీదేవి, 28న గాయత్రీ దేవి, 29న శ్రీ అన్నపూర్ణదేవి అలంకార రూపంలో దర్శనమివ్వనున్నారు.

Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్

సెప్టెంబర్ 30న శ్రీలలితా త్రిపురా సుందరి దేవి, అక్టోబర్‌ 1న శ్రీ మహాలక్ష్మి దేవి, 2న శ్రీ సరస్వతీ దేవి, 3న శ్రీ దుర్గాదేవి, 4న శ్రీమహిషాసుర మర్దని, 5న రాజరాజేశ్వరీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.