Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్

విజయవాడ దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనను మరింత కఠినతరం చేయనున్నారు. ఏఈవో స్థాయి ఉద్యోగి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు..

Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్

Vijayawada Kanaka Durga Temple

Vijayawada Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనను మరింత కఠినతరం చేయనున్నారు. ఏఈవో స్థాయి ఉద్యోగి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తెల్లని దుస్తులు తప్పనిసరి చేయనున్నారు. అంతరాలయంలో పంచె కట్టకపోయినా, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకపోయినా రూ.200 జరిమానా విధించనున్నారు. అలాగే సిబ్బందికి ఐడీ కార్డు లేకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు.

TTD EO Dharma Reddy : టీటీడీ కీలక నిర్ణయం.. కొత్త సాఫ్ట్‌వేర్, డిస్కౌంట్ రేట్లు

అంతేకాదు సమయపాలన పాటించకపోయినా, అలసత్వం వహించినా చర్యలు తప్పవన్నారు. డ్రెస్ కోడ్, ఐడీ కార్డ్, సమయపాలన, అలసత్వం విషయాల్లో మూడు సార్లు తప్పిదం చేస్తే సిబ్బందికి ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని ఈవో హెచ్చరించారు.

Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

ఇక అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తేల్చి చెప్పారు. భక్తుల డ్రెస్ కోడ్ కు సంబంధించి త్వరలోనే సర్కులర్ జారీ చేసే అవకాశం ఉంది.

Tirumala VIP Break Darshan : సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం

”ఇంద్రకీలాద్రిపై పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి డ్రెస్ కోడ్ పాటించాలి. తెలుపు రంగు చొక్కా, పంచె ధరించాలి. లేదంటే 200 రూపాయలు జరిమానా విధింస్తాం. అలాగే ఐడీ కార్డు లేకపోతే 100 రూపాయలు జరిమానా. విధులకు హాజరయ్యే సిబ్బంది పంచె, ఐడీ కార్డు ధరించి రావాలి. మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తాం” అని ఈఓ భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్, ఐడీ కార్డు, బయోమెట్రిక్ హాజరుపై అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు ఈవో.