Tirumala VIP Break Darshan : సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

Tirumala VIP Break Darshan : సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం

Tirumala (1)

Tirumala VIP Break Darshan : కలియుగ దైవం శ్రీ వేంటేశ్వర స్వామి కొలుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో తిరుమల కొండ భక్త జనంతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

వారాంతాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. స్వామి వారి దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో ఎక్కువమంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. కాగా, ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేసినట్టు ఈవో తెలిపారు. తిరుమలలో ఇక నుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారాయన.

Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

మరోవైపు క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ దగ్గర వైభవంగా నిర్వహిస్తామన్నారు. అలాగే, పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. ఇక ధర్మదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కేటాయింపును పునరుద్ధరిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.

TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం