Indrakiladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. అక్టోబర్ 15 నుంచి 23 వరకు, తొమ్మిది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం

ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.

Indrakiladri Dussehra Sharannavaratri

Indrakiladri – Dussehra Sharannavaratri Mahothsavas : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 15వ తేదీన ఉత్సవాల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం, 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం), 21న శ్రీ దుర్గా‌దేవి అలంకారం, 22న శ్రీ మహిషా సుర‌మర్ధనీ దేవి అలంకారం, 23న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

Andhra Pradesh : వేసవిలో భక్తుల కోసం కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు

ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు. అయితే అధిక, నిజ శ్రావణం నేపథ్యంలో తిధులను అనుసరించి ఈ ఏడాది తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.