Duvvada Vani : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి నుంచి తనకు, శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందన్నారు. మాధురి ట్రాప్ లో శ్రీనివాస్ పడ్డారని ఆరోపించారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తమ కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. పోలీసులు తక్షణమే స్పందించాలని, దువ్వాడ ఇంట్లో ఉంటున్న అనధికారిక వ్యక్తులను బయటకు పంపించాలని కోరారు. రేపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానన్నారు వాణి. దువ్వాడ దంపతుల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు.
కొన్ని రోజులుగా దువ్వాడ వాణి, శ్రీనివాస్ మధ్య చర్చలు జరిగాయి. ఆస్తులకు సంబంధించిన విషయాలు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. భార వాణి ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారని, అందులో కొన్నింటికి శ్రీనివాస్ ఒప్పుకున్నారని ప్రచారం జరిగింది. విడాకుల నోటీసులు వెనక్కి తీసుకునేందుకు శ్రీనివాస్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటి చుట్టూ వివాదం నెలకొంది. ఆ ఇంటిని భార్యకు ఇచ్చేందుకు శ్రీను ఒప్పుకోవడం లేదని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై వాణి క్లారిటీ ఇచ్చారు. తాము ఆస్తులు అడగటం లేదన్నారు. అవన్నీ కల్పించి చెబుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం శ్రీను ఉంటున్న ఇంట్లోనే తాము ఉంటామని చెప్పారు. అందరం కలిసి ఉండాలని, పిల్లల బాధ్యత తన భర్త శ్రీను తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు వాణి.
11 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తెలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడో వ్యక్తి వల్ల తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. మేము ఆస్తులు అడిగామని, మాకు రాజకీయ ఆకాంక్ష ఉందని తమ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని దువ్వాడ వాణి అన్నారు. ”నాకు శ్రీను ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా పిల్లలు ఆ ఇంట్లో ఉంటాం. మేము ఎలాంటి ఆస్తులు మొదటి నుంచి అడగటం లేదు. డిమాండ్లు కూడా పెట్టలేదు. మేమంతా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నా. ఇదే విషయాన్ని మీడియాతో క్లారిటీగా చెప్పాను.
నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదు. మా తాత, తండ్రి పొలిటికల్ కెరీర్ తోనే మేము ముందుకు వచ్చాం. అందరం కలిసి ఉండాలన్నదే నా కోరిక. నేను చెప్పింది ఒకటి, మీడియాలో వచ్చింది మరొకటి. వాణి ఒక అడుగు వెనక్కి తగ్గారని, వివాదం పరిష్కారమైందని చూపించారు. నాకు హెల్త్ బాగోలేదు, నేను 10 రోజులు అందుబాటులో ఉండను అని మాధురి ఒక వీడియో విడుదల చేసింది. అందరినీ డైవర్ట్ చేయడానికే మాధురి ఇలా చేసింది. ఆమె ఎక్కడికీ వెళ్లలేదు. మా ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. మా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. నేను, నా కూతురు ఇబ్బందుల్లో ఉన్నాము.
శ్రీను ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఆయనకు ఏమైనా జరిగితే మేమంతా రోడ్డున పడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో మూడో వ్యక్తి ఉండకూడదు. అన్ని రకాలుగా మాకు రక్షణ కల్పించాలి. ఎట్టిపరిస్థితుల్లో ఆ ఇంట్లో శ్రీను తప్ప మరో వ్యక్తి ఉండకూడదు. జగన్ కు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. మా లైఫ్ లు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని జగన్ , వైసీపీ పెద్దలు చాలా సీరియస్ గా శ్రీనుకి చెప్పాలి” అని దువ్వాడ వాణి అన్నారు.
Also Read : కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?