Earthquake In AP : నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు .. భయాందోళనలో స్థానికులు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లిలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో ఏజరుగుతుందో తెలియక ఆందోళన చెందిన స్థానికులు అవి భూ ప్రకంపనలు అని తెలిసి భయంతో బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
- nagamani
- Published on- November 7, 2022 / 12:15 PM IST
earthquake in nellore districts
Earthquake : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లిలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో ఏజరుగుతుందో తెలియక ఆందోళన చెందిన స్థానికులు అవి భూ ప్రకంపనలు అని తెలిసి భయంతో బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
కాగా నెల్లూరు జిల్లాలోనే గత ఆగస్టు నెలలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడం కలకలం రేపింది. ఉదయం ఒకసారి రాత్రివేళ మరోసారి మొత్తం రెండుసార్లు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని గ్రామాల్లో భూమి కంపించింది. 5 నుంచి 10 సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే రాత్రివేళ కావడం ఒకేరోజు రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూమి కంపించినప్పుడు పెద్ద శబ్ధాలు రావడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం కంటే రాత్రి ఎక్కువ సమయం కంపించింది అని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎంతమంది ప్రాణాలు పోతాయోనని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా గత ఆగస్టులోనే కాకుండా అంతకు ముందు జులై నెలలో కూడా ఇటువంటిదే జరిగింది. జులై 13 న భూమి కంపించిందని మళ్లీ ఆగస్టులో అదే తేదీన భూమి కంపించడంపై స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
