Earthquakes : చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.

Earthquakes in Chittoor district : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. పట్టణంలోని నందిశెట్టి వీధి, బిలాల్ మసీద్ వీధి, మగ్గాలు వీధి, చర్చి వీధి పలుచోట్ల భయంతో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. ఎక్కడ శబ్దం వచ్చిందని తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. తహశీల్దార్ నిర్మలా దేవి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో రెండు రోజుల క్రితం సోమల మండలంలో భూమి కంపించింది. మళ్లీ ఇవాళ ఉదయం రామకుప్పంలో భూమి కంపించింది. రామకుప్పం మండలంలోని గడ్డూరు, గెరిగెపల్లి, యానాది కాలనీ, కృష్ణనగర్, గొరివిమాకులపల్లి గ్రామాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుండి రెండు సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్..పలువురు మావోయిస్టులు మృతి

ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్ళ గోడలు బీటలు తెలిపారు. భూప్రకంపలు వచ్చినప్పుడు ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో ప్రజలంతా రాత్రి ఇంటిబయటే జాగారం చేశారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు