IAS Officers : ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

Senior IAS Officers Transfer : అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందులో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి ని నియమించారు. అయితే తదుపరి ఉత్త్వులు జారీ చేసేంతవరకూ జవహరర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్‌ఏ‌గా జి. సాయిప్రసాద్ బదిలీ, సాయి ప్రసాద్‌కు రెవెన్యూ భూరికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. జీఎస్ ఆర్కే ఆర్ విజయకుమార్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎక్సైజు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. శశిభూషణ్ కుమార్‌ను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం.. సాధారణ పరిపాలన శాఖ హెచ్ఆర్, సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.

Senior Ias Officers Transferred By Ap Govt 

రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఎండీ బాబు ఏకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీఎస్సీ నుంచి, రవాణాశాఖ కమిషనర్ పోస్టుల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖల నుంచి నీరబ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయలును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

కేవీ రాజేంద్రనాధ్ రెడ్డికి ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చిని నియమించగా.. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగానూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.

Read Also : AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. పెన్ డౌన్ కంటిన్యూ.. విద్యాశాఖ యాప్ డౌన్

ట్రెండింగ్ వార్తలు