Registration of Votes: కొత్త ఓటర్లు నమోదుకు అవకాశం

ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది.

Election Commission of Ap: ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి కూడా అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ ఓ ప్రకటన చేశారు.

షెడ్యూల్‌ ఇలా..
– ఆగస్టు 9వ తేదీ నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన జరగనుంది.
– నవంబర్ ‌1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
– నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి
– నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం
– అదే తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
– ఆ పోలింగ్‌ కేంద్రాల్లోనే కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in లేదా వోటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటను దరఖాస్తు చేసుకోవచ్చు.
– డిసెంబర్‌ 20వ తేదీ నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి చేస్తారు.
– జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు