AP : లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు.. సీఐని కారుతో ఢీకొట్టి పరారైన ఏఈ

పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఏఈ శాంతారావు రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు. ఏఈ శాంతారావు కారులో వచ్చి పొలంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

AE hit ACB CI with car

AE Hit ACB CI With Car In AP : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ ఏసీబీ సీఐని కారుతో ఢీకొట్టాడు.  లంచం డబ్బు విసిరేసి పొలాల్లోకి పరుగులు తీశాడు. ఈ ఘటన మక్కువ మండలం ములక్కాయవలసలో చోటు చేసుకుంది.

పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఏఈ శాంతారావు రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు. ఏఈ శాంతారావు కారులో వచ్చి పొలంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

Dalit Youth Kill : లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోలేదని.. దళిత యువకుడి హత్య, తల్లిని వివస్త్రను చేసి దాడి

అధికారులను చూసి కారులో పారిపోయేందుకు ఏఈ శాంతారావు యత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఏసీబీ సీఐని కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును వదిలి పారిపోయాడు. దీంతో లొంగిపోవాలని ఏఈకి ఏసీబీ అధికారులు హెచ్చరిక చేశారు.