Eluru : మృతి చెందిన అభ్యర్థులు గెలిచారు

తాము గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చివరకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. వారు గెలిచారు. దీనిని ఆనందించేందుకు వారిద్దరూ ఈ లోకంలో లేరు.

Ysrcp

YSRCP Candidates Who Died : తాము గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చివరకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. వారు గెలిచారు. దీనిని ఆనందించేందుకు వారిద్దరూ ఈ లోకంలో లేరు. ఎందుకంటే ఫలితాలు వెలువడటానికి ముందే వారు మృతి చెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున పోటీ చేసిన ఇధ్దరు గెలిచారు. అయితే..కరోనా వైరస్ సోకి..ఫలితాల విడుదల కంటే ముందే మృతి చెందారు.

Read More : Rahul Gandhi : ట్రాక్టర్ పై పార్లమెంట్ కి వచ్చిన రాహుల్ గాంధీ

45వ డివిజన్ నుంచి బేతపూడి ప్రతాప చంద్ర ముఖర్జీ, 46వ డివిజన్ నుంచి ప్యారీ బేగంలు వైసీపీ తరపున పోటీ చేశారు. ఇటీవలే ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో వైసీపీ జెండా రెపరెపలాడింది. టీడీపీ మూడు డివిజన్లలో, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఎక్కడా ప్రభావం చూపలేదు. అయితే..ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత..ఫలితాల కౌంటింగ్ నిర్వహించారు. బేతపూడి 1058, ప్యారీ బేగం 1232 ఓట్ల తేడాతో గెలుపొందారు. కానీ..కరోనా వైరస్ సోకడంతో వారు అప్పటికే చనిపోయారు.