ఏపీలో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్

  • Publish Date - November 18, 2020 / 03:53 PM IST

government employs transfers: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సంక్రాంతి వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు నిలిపివేశారు. 2021 జనవరి 15వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగనుంది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో సంబంధం ఉన్న ఉద్యోగులను బదిలీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరంగా ఉద్యోగులను బదిలీ చేయాల్సి వస్తే ఈసీ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు సీఈవో విజయానంద్.

ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్, పంచాయతీ రాజ్ కీలక శాఖల్లోని సిబ్బందికి రెండు నెలల పాటు బదిలీలు నిలిపివేసింది ప్రభుత్వం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఉండడంతో, ఆ ప్రక్రియకు సంబంధించిన శాఖల ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మురకు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ కార్యక్రమం నవంబర్ 16 నుంచి జనవరి 15 వరకు జరుగుతుంది.


https://10tv.in/ap-sec-nimmagadda-ramesh-kumar-key-decision/
జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులెవరినీ బదిలీలు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లు, ఉప రిటర్నింగ్ అధికారులుగా జేసీలు, ఆర్డీవోలు ఉంటారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ యంత్రాంగం మొత్తం ఇందులో పాలు పంచుకోవాల్సి ఉండటంతో ఆయా శాఖల్లోనూ ట్రాన్సఫర్లు ఉండవు. ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తే, ముందుగా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు