పబ్జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారు, ఆ గేమ్ ని బ్యాన్ చేయడంతో తట్టుకోలేకపోతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి, డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ బంగారు భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా పబ్జీ కారణంగా మరో విద్యార్థి ప్రాణం పోయింది. అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. రెవెన్యూ కాలనీలో నివాసం ఉండే ఇంజినీరింగ్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పబ్జీ గేమ్ కు బానిసగా మారిన కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ ఫోన్ లో స్టేటస్ పెట్టి మరీ చనిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కిరణ్ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
https://10tv.in/life-certificate-from-november-1-to-december-31-minister/
భారత్ – చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనాపై డిజిటల్ స్ట్రైక్ కి తెరలేపిన భారత్.. వరుసగా ఆదేశానికి సంబంధించిన మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ వస్తోంది. తాజాగా.. పబ్జీ సహా 118 యాప్‌లను బ్యాన్ చేసింది. దీంతో పబ్జీ కి బానిసైన కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్థులు బంగారం లాంటి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో పూర్బా లాల్పూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి బిస్వజిత్ హాల్డర్ కుమారుడు ప్రీతిమ్ హాల్డర్ రోజు రాత్రి మొబైల్‌లో విపరీతంగా పబ్జీ ఆడేవాడు. అయితే పబ్జీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో అప్పటి నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ఓ రోజు తనగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 24గంటలూ గేమ్‌లోనే మునిపోయిన వారు ఈ బ్యాన్ ను తట్టుకోలేకపోతున్నారు. డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లల్లో ఈ విపరీత ధోరణి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.
పిల్లలకు సెల్ ఫోన్లు కొనివ్వడం కాదు, వారు అందులో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే దానిపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ను సరిగా వినియోగిస్తారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అసలు గేమ్స్ కు బానిసలుగా కాకుండా చూసుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అలర్ట్ అవ్వాలి. పిల్లలను డైవర్ట్ చేయాలి. పరిస్థితి చేయి దాటాక బాధ పడేకంటే, ముందే మేల్కోవడం మంచిది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం లేదని నిపుణులు అంటున్నారు.