Engineering Student Molested By Shop Owner
Student molested by Shop Owner : ఇంజినీరింగ్ విద్యార్థినిపై స్వీట్స్ షాప్ యజమాని అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. షాపులో పనిచేస్తున్న విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది.
కరోనా కారణంగా కాలేజీ మూతపడింది. కుటుంబానికి ఆసరాగా నిలవాలని స్వీట్స్ షాపులో నెలకు రూ.5 వేల జీతానికి పనిలో చేరింది. యజమాని షాపులో ఎవరూ లేని సమయంలో ఆమెకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగి మత్తులోకి జారుకుంది. ఆ సమయంలో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై అత్యాచారం జరిగినట్టు గ్రహించిన యువతి తల్లిదండ్రులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.