Enquiry In Ap High Court About Covid Cases
AP High Court: రాష్ట్రంలో పెరుగుతోన్న కొవిడ్ కేసులు దానికి తగ్గట్లు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందడంలేదంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అవడంతో విచారణకు స్వీకరించింది.
కొవిడ్ ప్రభావం చిన్నారులపై ఎంతవరకూ ఉంది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత కారణంగా ఏమేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు. చిన్నారుల్లో కొవిడ్ ప్రభావంపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో 1777 బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు తెలిపింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అఫిడవిట్ సమర్పించలేదంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కొరతను అధిగమించే చర్యలపై సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది.