టీటీడీలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ.. ఏం జరుగుతుందో తెలుసా?

తిరుపతికి రాష్ట్ర విజిలెన్స్ టీమ్స్ చేరుకోనున్నాయి. టీటీడీలో జరిగిన అక్రమాలపై..

తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న అవినీతి, శ్రీవాణి ట్రస్ట్, ఇంజనీరింగ్ పనుల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం తిరుపతికి రాష్ట్ర విజిలెన్స్ టీమ్స్ చేరుకోనున్నాయి.

టీటీడీలో జరిగిన అక్రమాలపై లోతైన దర్యాప్తు జరపాలని సర్కారు స్పష్టం చేసింది. ప్రధానంగా అవినీతి ఎక్కడ జరిగింది అన్నదానిపై విచారణ జరగనుంది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. టికెట్ల వ్యవహారంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే టీటీడీలోని పలు విభాగాల్లో విజిలెన్స్‌ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి.

వేంకటేశ్వరుడి దర్శనం టికెట్ల కేటాయింపుతో పాటు శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. దాని ఆధారంగానే తనీఖీలు చేశారు. ఇంజినీరింగ్ పనులకు పాలక మండలి కొన్ని వందల కోట్లు కేటాయించినట్లు, ఆయా పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో ఐదేళ్లలో జరిగిన పనులపై అధికారులు వివరాలు తీసుకుంటున్నారు.

Also Read: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. స్పష్టం చేసిన మంత్రి.. హోం మంత్రిగా సీతక్క?

ట్రెండింగ్ వార్తలు