Krishna River Water Dispute : నదీ జలాల విషయంలో కేసీఆర్,జగన్ డ్రామాలాడుతున్నారు- దేవినేని ఉమ

నదీ జలాల పంపకం విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామాహేశ్వర రావు అన్నారు.

Krishna River Water Dispute : నదీ జలాల పంపకం విషయంలో ప్రభుత్వం  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామాహేశ్వరరావు అన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో కేసియర్, జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.  ఈరోజు ఆయన విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద మాట్లాడుతూ…. ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఈ డ్రామాలు ఆడుతున్నారని … ఏపి,తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాం క్రియేట్ చేశారని దుయ్యబట్టారు.

డెల్టాకి అన్యాయం చేసి సముద్రంలోకి నీటిని విడుదల చేసారని ఆయన అన్నారు. రైతాంగ హక్కులను సీఎం కాపాడాలని ఆయన కోరారు. అపెక్స్ కౌన్సిల్లో నదీ జలాల వివాదంపై సీఎం ఎందుకు మాట్లాడలేదని దేవినేని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉత్పత్తి  నిలిపి వేశాలా సీఎం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ గారి దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీల తెలంగాణకు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టామని మాజీ మంత్రి గుర్తు చేశారు. 40 ఏళ్ల అనుభవానికి, ఒక తెలివి తక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే అని ఆయన అన్నారు.

టీడీపీ హయాంలో పట్టిసీమ కట్టాము…. రాయలసీమ, పట్టిసీమ, మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాము అని తెలిపారు.  అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం  ముఖ్యమంత్రిని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానని చెప్పారని అది ఏమైందని దేవినేని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజి నుంచి వదిలే నీరు సముద్రంలోకి కాకుండా కాలువలలోకి  పంపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ట్రెండింగ్ వార్తలు