Erramala Hills
Treasure Hunt In Kanigiri Swamy Temple: కర్నూలు జిల్లాలో మరోసారి గుప్తనిధులు తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని అవుకు ఎర్రమల కొండల్లోని కనిగిరి స్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకుని ఆరుగురు ముఠాను అరెస్ట్ చేశారు. కనిగిరిస్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది గుప్తనిధులు కోసం క్షుద్రపూజలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మిన కొంతమంది ముఠాగా ఏర్పడ్డారు. వీటి కోసం క్షుద్రపూజలు చేశారు.
అవుకులో కనిగిరిస్వామి ఆలయం చాలా పురాతనమైనది. ఈ క్రమంలో ఆ ఆలయ పరిసరాల్లో నిధి నిక్షేపాలు ఉంటాయని దురాశతో ఆరుగురు వ్యక్తులు వాటిని దక్కించుకోవటానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. దీంట్లో భాగంగా పసుపు, కుంకుమలు,నిమ్మకాలు వంటి క్షుద్రపూజలు చేసే సామగ్రితో ఆలయ దగ్గరకు చేరుకుని ముందుగా పూజలు చేసి తవ్వకాలు చేద్దామనుకున్నారు. అలా పూజలు చేసి..అనంతరం తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.