Extortion case in the name of IT gang creating sensation
Guntur: ఐటీ గ్యాంగ్ పేరుతో గుంటూరులోని ప్రగతి నగర్లో జరిగిన దోపిడీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక డీయస్పీ సీతారామయ్య స్పందిస్తూ ముగ్గురు వ్యక్తులు ఐటీ అధికారులం అంటూ ఇంట్లోకి చొరబడ్డారని, మహిళను బంధించి సెల్ ఫోన్లు లాక్కుని ఇల్లు సోదా చేశారని తెలిపారు. ఇంట్లో దూరిన దుండగులు తనకు గన్ చూపించి బెదిరించినట్లు సదరు మహిళ విచారణలో వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను సైతం తీసుకుపోయారని ఆమె తెలిపింది.
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు.. పోలీసుల కస్టడీ నుంచి విడుదల
గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళ బినామీగా ఉంటుందని అనుమానం ఉందని, మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు, నగలు ఎందుకు ఉన్నాయో ఆరా తీస్తున్నామని సీతారామయ్య అన్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంకు పెట్టెలో ఉన్న యాభై లక్షల నగదు, బీరువాలో ఉన్న యాభై లక్షల విలువైన బంగారం దోపీడీ జరిగినట్లు ఫిర్యాదు తమకు అందిందని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీంతో పాటు మరో మూడు బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు.
Minister KTR : కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన మళ్లీ కావాలా? కేటీఆర్