Minister KTR : కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన మళ్లీ కావాలా? కేటీఆర్
ఓ కాంగ్రెస్ పిచ్చోడు ప్రగతి భవన్ ను పేల్చేయాలి అంటాడు. మరో బీజేపీ పిచ్చోడు సచివాలయం కూల్చాలి అంటాడు. పిచ్చోళ్ల చేతుల్లో పార్టీలు ఉంటే పచ్చగా ఉన్న తెలంగాణ అగమైతుంది. ఇలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో తెలంగాణ పాలన పెట్టొద్దు.

Minister KTR : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ జరిగింది. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు. బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలోనే జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గండ్ర వెంకటరమణ రెడ్డి తెలంగాణ కోసం తపనపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు.
”రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు. పదిసార్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించింది. ఏమిచ్చింది? దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన కావాలా? కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేదు, తాగు నీరు లేదు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలో ఉంది.
ఓ కాంగ్రెస్ పిచ్చోడు ప్రగతి భవన్ ను పేల్చేయాలి అంటాడు. మరో బీజేపీ పిచ్చోడు సచివాలయం కూల్చాలి అంటాడు. పిచ్చోళ్ల చేతుల్లో పార్టీలు ఉంటే పచ్చగా ఉన్న తెలంగాణ అగమైతుంది. ఇలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో తెలంగాణ పాలన పెట్టొద్దు. తెలంగాణ రాకపోతే టీ బీజేపీ.. టీ కాంగ్రెస్ ఉండేదా? రేవంత్ రెడ్డి మాట్లాడితే ఓ పిచ్చోనిలాగా ఉంటుంది. కాంగ్రెస్ కు పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారో ప్రజలకు చెప్పండి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ఎమ్మెల్యే గండ్ర బేషరతుగా కాంగ్రెస్ నుండి BRSలో చేరారు. రాజస్థాన్ లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా? మీకో న్యాయం? మాకో న్యాయామా?
Also Read..Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన ప్రైవేట్ కాలేజీలు : బండి సంజయ్
సింగరేణిపై బీజేపీ కన్ను పడింది. సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వము. సింగరేణి కార్మికుల కోసం ఎక్కడి దాకానైనా కొట్లాడుతాం. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం అయితే 4 కోట్ల ప్రజలకు లాభం. మధుసూదనాచారిని మీరు పడగొట్టినా సముచిత స్థానం కల్పించారు. మధుసూదనాచారిని ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ గౌరవించారు. ఎవరి సమర్థత ఏంటో సీఎం కేసీఆర్ కి తెలుసు” అని మంత్రి కేటీఆర్ అన్నారు.