AP High Temperature : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో బయటకు రావొద్దు.. APSDM కీలక హెచ్చరికలు జారీ చేసిన
High Temperatures In AP : ఏపీలో భానుడు మంటలు మండిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
- Harishth Thanniru
- Updated on- April 14, 2026 / 11:16 AM IST
High Temperatures In AP April 14
- ఏపీ ప్రజలకు అలర్ట్..
- రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- అప్రమత్తంగా ఉండాలంటూ APSDMA సూచన
AP High Temperature : వేసవి కాలం వచ్చేసింది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDM) హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయాల్లో ఎక్కువ శాతం బయటకురాకుండా ఉండేలా చూసుకోవాలని.. ఒకవేళ మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చినా ఎండ వేడిమి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read : ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు..! టీడీపీ పొలిటికల్ స్కెచ్ అదేనా..!
ఏపీలో భానుడు మంటలు మండిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
సోమవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా సంజామలలో 44 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్య పాలెంలో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43.2 డిగ్రీలు, కర్నూల్ జిల్లా గూడూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా పల్నాడు జిల్లా దుర్గిలో 42.7, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
APSDMA తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ (మంగళవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 33 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మంచి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలని.. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది అంటున్నారు. ఒకవేళ వెళితే గొడుగు, టోపీ ధరించాలని సూచనలు చేస్తున్నారు.
